Wednesday, December 8, 2010

FindBigMail: మీ జీమెయిల్ అకౌంట్ లో పెద్ద మెయిల్స్ ని తెలుసుకోవటానికి వెబ్ సర్వీస్ !!!

మీ జీమెయిల్ ఇన్-బాక్స్ లో అనవసరమైన పెద్ద మెయిల్స్ ని తెలుసుకొని వాటిని తొలగించటానికి FindBigMail ఉపయోగపడుతుంది. దీనికోసం మనం చెయ్యవలసిందల్లా FindBigMail సైట్ కి వెళ్ళి మన జీమెయిల్ ఐడి ఎంటర్ చేసి ’Click Here' బటన్ పై క్లిక్ చెయ్యాలి తర్వాత FindBigMail మన జీమెయిల్ అకౌంట్ యాక్సెస్ చెయ్యటానికి అనుమతి కోరుతుంది, అనుమతి ఇవ్వటం కోసం ’Grant access' పై క్లిక్ చెయ్యాలి. FindBigMail మన ఈ-మెయిల్ సైజ్ ని మాత్రమే స్కాన్ చేస్తుంది, కంటెంట్ ని స్కాన్ చెయ్యదు.





స్కానింగ్ పూర్తి అయిన తర్వాత మైయిల్స్ సైజ్ ప్రకారం లేబుళ్ళు క్రియేట్ చెయ్యబడతాయి. దీనితో పెద్ద మెయిళ్ళ ను సులభంగా తెలుసుకోవచ్చు మరియు అనవసరమైన వాటిని తొలగించవచ్చు.



వెబ్ సైట్: FindBigMail

No comments:

Post a Comment