Thursday, September 30, 2010

ప్రభుత్వ సంస్ధల చిరునామా, దూరవాణి, ఫాక్స్, వెబ్ సైట్ వివరాలు

http://sarkaritel.com/ - కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల, మంత్రిత్వ శాఖల, వివిధ డిపార్టుమెంటుల, ప్రభుత్వరంగ సంస్ధల, విశ్వవిద్యాలయాల ఇంకా మరెన్నో ప్రభుత్వ సంస్ధల... చిరునామా, దూరవాణి, ఫాక్స్, వెబ్ సైట్ వివరాలు పొందుపరచబడిన వుపయోగకరమైన వెబ్ సైట్.

పదవ తరగతి ఫలితాల వెబ్ సైట్లు

పదవ తరగతి ఫలితాలు  కోసం క్రింది వెబ్ సైట్ల ను చూడండి:
schools9.com, nettlinxresults.net, manabadi.com, studentwala.com, myguruonline.net, pratibhaplus.com, greatgala.com, manabadi.co.in, results.webdunia.com, educationguide.co.in, brainparlour.com, sscresults.sol.net.in, groomingindia.com, examresults.net, results.sify.com, rediff.com, ourpathfinder.com

ఆన్ లైన్ ఫైల్ స్టోరేజ్ (Online File Storage)


మీరు బిజినెస్ పని మీద వివిధ ప్రదేశాలను తిరగ వలసి వస్తుందా ...మీతో ప్రతిసారీ పెద్ద సైజ్ లో డాటా తీసుకొని వెళ్ళవలసి వస్తుందా ?? అయితే మీ లాంటి వారి కోసమే ఆన్ లైన్ ఫైల్ స్టోరేజ్ .... మీ డాటా కరప్ట్ కాకుండా ...వైరస్ అటాక్ కాకుండా సురక్షితంగా వుంచబడుతుంది...దీని కోసం ఇంటర్ నెట్ లో ఎన్నో సైట్ లు వున్నాయి....కొన్ని ఫ్రీ అయితే ....ఇంకొన్ని ఫ్రీ మరియు పెయిడ్...
అలాంటి వాటిలోని ఒక సైటే www.rapidshare.com

Rapidshare:
www.rapidshare.com ఆన్ లైన్ ఫైల్ స్టోరేజ్ కి సంబంధించిన ఒక పాపులర్ సైట్... ముందుగా సైట్ ని ఓపెన్ చేయండి... Browse బటన్ పై క్లిక్ చేసి అప్ లోడ్ చెయ్యవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి..తర్వాత Upload బటన్ పై క్లిక్ చెయ్యాలి...అలా చేస్తే మనకు రెండు లింకులు వస్త్తాయి... ఒకటి ఫైల్ డౌన్ లోడ్ చెయ్యటానికి...ఇంకొకటి డిలీట్ చెయ్యటానికి...వాటిని జాగ్రత్తగా మీ సిస్టం లో సేవ్ చేసుకోండి. ఈ సైట్ లో అప్ లోడ్ చేసే ఫైల్ సైజ్ లిమిట్ 100 MB...పెద్ద ఫైల్స్ ని స్ప్లిట్ చేసుకోవచ్చు... అన్ లిమిటెడ్ ఫైల్స్ ని అప్ లోడ్ చేసు కోవచ్చు.

Rapidshare is a Popular site which offers unlimited number of file uploads, goto www.rapidshare.com to upload ur files...click on 'Browse' button to select the file which is to be uploaded...then click on the button 'Upload'...then two links will come..one is for to download the uploaded file and another one is to delete the file from the site. save this two links for later use. there is a size limit of 100 MB per file. Larger files can be split.

ఆన్ లైన్ ఫైల్ స్టోరేజ్ facilty కల మరికొన్ని వెబ్ సైట్ లు(few more web sites for online file storage) www.megaupload.com, www.yourfilehost.com, www.xdrive.com

పాత తెలుగు పాటల కోసం....


పాత తెలుగు పాటల కోసం http://oldtelugusongs.com/ కి వెళ్ళండి...

ఈనాడు స్పోకెన్ ఇంగ్లీష్


ఈనాడు దిన పత్రిక లో ప్రచురించే స్పోకెన్ ఇంగ్లీష్ వ్యాసాల కోసం http://www.eenadu.net/spoken/spoken.htm కి వెళ్ళండి.

ఆధ్యాత్మిక వెబ్ సైట్లు (Bhakti Online)


కొన్ని ఆధ్యాత్మిక వెబ్ సైట్ల అడ్రస్ లు ఇక్కడ యివ్వటం జరిగింది...చూడండి...చూసితరించండి....

http://www.tirumala.org/, http://saibaba.org/ , http://www.geocities.com/ongolebaba/, http://eprarthana.com/, http://prarthana.com/, http://www.iskcon-hyderabad.com/, http://www.iskconbangalore.org/, http://www.rkmath.org/, http://www.telugubhakti.com/, http://www.teluguone.com/bhakti/, http://www.dwarakatirumala.org, http://srisailamonline.com/, http://www.durga-puja.org/, http://annavaramdevasthanam.nic.in/, http://www.indiantemples.com/, http://www.indiantemplesportal.com/, http://www.indiatemplesinfo.com

గ్రామీణ ప్రజలకు ప్రత్యేక పోర్టల్


గ్రామీణ్ ప్రాంత ప్రజలకు అవసరమయ్యే సమాచారాన్ని అందించే పోర్టల్ www.indg.in
ఇందులో వ్యవసాయం, ఆరోగ్యం, ప్రాధమిక విద్య తదితర అంశాల్లో సమాచారం అందుబాటులో వుంటుంది. ఈ-పరిపాలన సౌకర్యమూ వుంటుంది.C-Dac డెవలప్ చేసిన ఈ పోర్టల్ తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో చూడొచ్చు.

ఫ్రీ ఎస్.ఎమ్.ఎస్ పంపే వెబ్ సైట్లు


ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ గా ఎస్.ఎమ్.ఎస్ పంపటానికి ఈ వెబ్ సైట్లు చూడండి http://wwwb.way2sms.com/content/index.html, http://www.160by2.com/

సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ వెబ్ సైట్


సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు సమాచారదర్శినిగా ఒక వెబ్ సైట్ http://cyberabadpolice.gov.in/ ను ఇటీవల ప్రారంభించారు। ఈ సైట్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ల లో పనిచేస్తున్న అధికారులు, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, హెల్ప్ లైన్ తదితర వివరాలు, కేసుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కమీషనరేట్ పరిధిలోని ప్రాంతాలను తెలియచేసే రూట్ మ్యాప్ దొరుకుతుంది. విదేశీయులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశాన్నిఈ సైట్ లో కల్పించారు.

ఆన్ లైన్ వైరస్ స్కానింగ్...ఉచితంగా...

ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లలో ఉచితంగా ఆన్ లైన్ లో వైరస్ స్కానింగ్ చెయ్యవచ్చు:

1.Norton
http://security.norton.com/sscv6/default.asp?langid=ie&venid=sym

2.Mcafee
http://us.mcafee.com/root/mfs/default.asp?affid=294

3.Avast Online Scannerhttp://onlinescan.avast.com/

4.ESET Online Scanner(NOD32)
http://www.eset.com/onlinescan

5.Panda ActiveScan
http://www.pandasoftware.com/products/ActiveScan.htm

6.Bitdefender
http://www.bitdefender.com/scan8/ie.html

7.Kaspersky
http://www.kaspersky.com/virusscanner

8.Trend Micro
http://housecall.trendmicro.com/

http://irctc.co.in/ - ఆన్ లైన్ రైల్వే పాసింజర్ రిజర్వేషన్ సైట్


రైల్వే టికెట్ రిజర్వేషన్ కోసం గంటలకొద్దీ కౌంటర్ల దగ్గర నిలబడే కన్నా, Indian Railway Catering and Tourism corporation Ltd. వారి http://irctc.co.in/ ద్వారా ఆన్ లైన్ లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. యూజర్ ఐడి మరియు పాస్ వార్డ్ కోసం ముందుగా సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. యూజర్ ఐడి ఈ-మెయిల్ కి పంపబడుతుంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వుపయోగించి రెండు విధాలుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు ఒకటి i-ticket - టికెట్ మన అడ్రస్ కి పోస్ట్/కొరియర్ లో పంపబడుతుంది. రెండవది e-ticket - ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకొని అప్పుడే ప్రింట్ తీసుకోవచ్చు., ఈ పధ్ధతిలో పాసింజర్ ఫొటో ఐడి వివరాలు ఇవ్వాలి. ప్రయాణించేటప్పుడు మనతోపాటు ఫొటో ఐడి తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ టికెట్ కాన్సిల్ చెయ్యవలసివస్తే ఆన్ లైన్ లోనే చెయ్యవచ్చు.

ఎంత చిన్న ఇమేజ్ నైనా ఎంత పెద్దగా నైనా చెయ్యటానికి...

మీ దగ్గర వున్న చిన్న ఇమేజ్ లను పెద్దగా చేసి A4 సైజ్ లో ప్రింట్ తీసుకొని పోస్టర్ గా అతికించు కోవచ్చు కేవలం మూడు స్టెప్పుల్లో ... ఇది పూర్తిగా వుచితంగా... దీనికోసం http://www.blockposters.com/ కి వెళ్ళండి. ’Click here to start' దగ్గర క్లిక్ చెయ్యాలి.


1. Step 1 లో పెద్దగా చెయ్యవలసిన ఇమేజ్ ని ’Browse' పై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Continue' పై క్లిక్ చెయ్యాలి.



2. Step 2 : ఇక్కడ పేజీల సంఖ్య, పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకొని ’Continue' పై క్లిక్ చెయ్యాలి.



3. Step 3: ఇమేజ్ పెద్దగా చెయ్యబడి, పీడీఎఫ్ లోకి మార్చబడుతుంది, ’Click here to download a PDF file containing your image’ పై క్లిక్ చేసి ఫైల్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ స్వంత సెర్చ్ ఇంజిన్ తయారుచేసుకోండి

మీ పేరు మీద సెర్చ్ ఇంజిన్ తయారుచేసుకోవటానికి ముందుగా http://funnylogo.info/create.asp కి వెళ్ళాలి.
అక్కడ step 1 లో మీ పేరు ఎంటర్ చేసి, Step 2 లో స్టైల్ సెలెక్ట్ చేసుకొని, క్రింద ’Create My Search Engine' పై క్లిక్ చెయ్యాలి.



సెర్చ్ ఇంజిన్ క్రియేట్ అవుతుంది, అక్కడ ’Make as Homepage' పై క్లిక్ చేస్తే వచ్చే రెండు ఆప్షన్లలో ఒకదానిని సెలెక్ట్ చేసుకొని ’Yes' బటన్ పై క్లిక్ చెయ్యాలి.





ఇలాంటిదే మరొక సైట్ http://www.pimpmysearch.com/

ప్రెజెంటేషన్లను మీ వెబ్ సైట్ కి యాడ్ (Embed) చెయ్యటానికి !!

PowerPoint, OpenOffice లేదా PDF Presentatations ని షేర్ చేసుకోవటమే కాకుండా మీ వెబ్ సైట్ కి యాడ్ చెయ్యటానికి http://www.slideshare.net/ కి వెళ్ళాలి. 100MB సైజ్ వరకు ఫైళ్ళ ను upload చేసుకోవచ్చు. అప్ లోడ్ చెయ్యబడిన ఫైల్ SlideShare format లోకి మార్చబడుతుంది, దానికి ఆడియో (MP3) ని జత చెయ్యవచ్చు. HTML code కూడా జెనెరేట్ అవుతుంది, దానిని మన వెబ్ సైట్ లేదా బ్లాగ్ కి యాడ్ (Embed) చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్లను షేర్ చేసుకోవటానికి ఇది బెస్ట్ సైట్ అని చెప్పవచ్చు.





వాచ్ టీవీ ఆన్ ఇంటర్ నెట్

విశ్వవ్యాప్తంగా వున్న టీవీ ఛానళ్ళను ఇంటర్ నెట్ లో చూడాలంటే http://tvunetworks.com/ కి వెళ్ళాలి. ఇక్కడ న్యూస్, స్పోర్ట్స్, ఫన్, కార్టూన్, మూవీస్, మ్యూసిక్ సంబంధించిన వివిధ ఛానళ్ళను చూడవచ్చు. ఇదే సైట్ లో దొరికే TVU Player డౌన్ లోడ్ చేసుకొని డైరెక్ట్ గా ఛానళ్ళను ఫ్లేయర్ లోనే చూడవచ్చు. 3G మొబైల్ ఫోన్ల లో టీవీ చూడాలంటే TVUMobile సాప్ట్ వేర్ ఇదే సైట్ లో దొరుకుతుంది.




ఒక చిన్న చిట్కా:వివిధ వీడియో లను Paint లో ప్లే చెయ్యాలంటే, ముందుగా వీడియో ను ప్లే చేసి కీబోర్డ్ లోని ’Print Scrn' బటన్ ప్రెస్ చేసి తర్వాత paint ఓపెన్ చేసి Edit---> Paste లేదా [Ctrl]+[V] బటన్లు ప్రెస్ చెయ్యాలి. అంతే వీడియో Paint లో ప్లే అవుతుంది.

ఈ - గ్రీటింగ్స్ కోసం....


ఇంకా రెండు మూడు రోజుల్లో నూతన్నోత్సాహం తో మరియు క్రొత్త ఆశలతో 2009 ని ఆహ్వానించబోతున్నాం...ఇదివరకు రోజుల్లో ముందుగా గ్రీటింగ్ కార్డ్స్ కొని పోస్టాఫీస్ కి వెళ్ళి స్టాంపులు అంటించి పోస్ట్ చేసే వాళ్ళం...కష్టపడి ఇంతా చేస్తే అనుకొన్న రోజుకి చేరదు... మొబైల్ ఫోన్ల వాడకం పెరిగిన SMS ద్వారా గ్రీటింగ్స్ పంపుదామంటే క్రొత్త సంవత్సరం రోజున నెట్ వర్క్ బిజీ వుంటుంది. ఈ ఇబ్బందులేమీ లేకుండా ఇంటర్నెట్ లో చక్కని మెసేజ్ లతో వుచిత ఈ-గ్రీటింగ్స్ దొరుకుతాయి, మనకు కావలసిన వారికి వారి ఈ-మెయిల్ ఐడి కి కావలసిన రోజున ఈ-గ్రీటింగ్స్ పంపవచ్చు. వినసొంపైన సంగీతం జతచేయబడిన మ్యూజికల్ గ్రీటింగ్స్,మన వాయిస్ మెసేజ్ నీ జత చేసుకోవటానికి అవకాశమున్న గ్రీటింగ్స్, యానిమేషన్, త్రీడీ ఇలా వెన్నో వెరైటీ ఈ-గ్రీటింగ్స్ నెట్ లో లభ్యమవుతాయి... అంతా వుచితంగానే ...కావలసినదల్లా మీ బంధు మిత్రుల ఈ-మెయిల్ ఐడీ లే....

ఈ-గ్రీటింగ్స్ దొరికే కొన్ని వెబ్ సైట్లు:
1.http://www.telugupeople.com/Greetings/GreetingsGallery.aspx
2. http://www.123greetings.com/
3. http://www.123newyear.com/
4. http://www1.egreetings.com/index.pd
5.http://egreetings.indiatimes.com/egreet/index.jsp
6.http://www.cry.org/cryegreetings/index.aspx
7. http://www.free-egreetings.net/
8. http://www.101egreetings.com/
9.http://www.in.com/
10.http://awesomecybercards.com/
11.http://www1.yahoo.americangreetings.com/index.pd
12.http://greetings.123india.com/
13.http://greetings.webdunia.com/telugu.html

ఇలా ఎన్నో వెబ్ సైట్ లు వున్నాయి ...యింకా ఆలశ్యం దేనికి ఈ-గ్రీటింగ్ పంపటం మొదలు పెట్టండి...

నూతన సంవత్సర శుభాకాంక్షలతో ....

Google లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ మరియు ట్రాన్స్ లిటెరేషన్ వెబ్ సైట్లు...

క్రొత్త సంవత్సరం లో ప్రతి రోజు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని...మీ ఇంట నవ్వుల పువ్వులు విరబూయాలని ఆశిస్తూ ...మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...

Google లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వెబ్ సైట్ http://translate.google.com/ ఇక్కడ వివిధ భాషల నుండి వేరొక భాషలోకి టెక్స్ట్ ను అనువదించవచ్చు. భారతీయ భాషలలో హిందీ మాత్రమే వుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో హిందీ ఎక్కువగా వుపయోగించాలనే నిభందన వుంటుంది. హిందీ టైపింగ్ /అనువాదం తెలియనివారు ఆంగ్లంలో టైప్ చేసి హిందీ లోకి అనువదించులోవచ్చు. వారికి ఈ సైట్ చాలా వుపయోగపడుతుంది.



Google వారిదే మరొక వెబ్ సైట్ http://www.google.com/transliterate/indic/Telugu. ఇక్కడ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మళయాళం భాషలలో టైపింగ్ తెలియని వారు ఆ భాష టెక్స్ట్ ను ఆంగ్లం లో టైప్ చేస్తే అది ఆ భాషలోకి మార్చబడుతుంది. ఇక్కడ టైప్ చెయ్యబడిన టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్,వెబ్ సైట్లలో కాపీ,పేస్ట్ చేసుకోవచ్చు.

MP3 Search - మ్యూజిక్ సెర్చ్ ఇంజిన్


మనకు నచ్చిన పాటలను వినటానికి లేదా డౌన్ లోడ్ చేసుకోవటానికి MP3 Search అనే మ్యూజిక్ సెర్చ్ ఇంజిన్ వుపయోగపడుతుంది. MP3 Search సైట్ కి వెళ్ళి ట్యూన్ లేదా ఆర్టిస్ట్ పేరు టైప్ చేసి Search కొడితే పాటల లిస్ట్ వస్తుంది. కావలసిన పాటను వినవచ్చు లేదంటే డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం MP3 Search సైట్ కి వెళ్ళండి కావలసిన పాటను వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి.

తెలుగు MP3 పాటల డౌన్ లోడ్ కొరకు ఒక మంచి వెబ్ సైట్...


తెలుగు MP3 పాటల డౌన్ లోడ్ కొరకు ఒక మంచి వెబ్ సైట్/బ్లాగు http://www.ezeemp3.com/. ఇక్కడ వేలకొద్దీ పాత, క్రొత్త పాటలు MP3 రూపంలో డౌన్ లోడ్ కి సిధ్ధంగా వుంటాయి. సినిమా పేర్లను అక్షర క్రమం లో వుంచారు, అక్కడ దొరకనివి సైట్ లో ఇచ్చిన సెర్చ్ లో పాట లేదా సినిమా పేరు టైప్ చేసి కావలసిన పాట ను పొందవచ్చు. భక్తి పాటలు, మెలోడీ పాటలు, సంగీత దర్శకులు, సినిమా విడుదలైన సంవత్సరం ఇలా వివిధ క్యాటగిరీలలో పాటలను వుంచటం వలన కావలసిన పాటలను వెతుక్కోవటం సులువు. చిన్నారులకు అవసరమైన చిట్టిగీతాలు కూడా ఇక్కడ వున్నాయి. ఈ సైట్ కు 26 లక్షల పైగా హిట్స్ వున్నాయి.

గమనిక: డౌన్ లోడ్ చేసుకొనే ముందు సైట్ లోని Disclaimer Notice చూడండి.

www.mustseeindia.com - One Stop Travel Guide to India


సెలవల్లో సరదాగా ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారా, హిల్ స్టేషన్లు, ఫుణ్యక్షేత్రాలు, బీచ్ లు, చారిత్రక ప్రదేశాలు చూడాలనుకుంటాన్నారా, హనీమూన్ కి వెళ్ళాలను కుంటున్నారా అయితే మీరు www.mustseeindia.com సైట్ ని ఒకసారి సందర్శించాల్సిందే. ఈ సైట్ లో మీరు వెళ్ళానుకుంటున్న ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రదేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే చూడదగిన ప్రదేశాలు, మ్యాప్, అక్కడకు ఎలా చేరుకోవాలి, ఫోటోలు, వాతావరణ వివరాలు, హోటళ్ళ వివరాలు మొదలగునవి తెలుసుకోవచ్చు. ఇది ఒక మంచి ట్రావెల్ గైడ్ సైట్.

Digital Photography School - డిజిటల్ ఫోటోగ్రఫీ టిప్స్ మరియు ట్యుటోరియళ్ళు


డిజిటల్ ఫోటోగ్రఫీ కి సంబంధించిన టిప్స్ మరియు ట్యుటోరియళ్ళు కోసం Digital Photography School సైట్ ని సందర్శించండి. డిజిటల్ కెమేరా కొని మొదటిగా దానిని వుపయోగించే వారికోసం, సందర్భానుసారంగా ఫోటోలు ఎలా తీయాలి, చిన్నపిల్లల ఫోటోలు ఎలా తీయాలి ఇలా ఎన్నో విషయాలకు సంబంధించిన టిప్స్ మరియు ట్యుటోరియళ్ళు ఇక్కడ పొందుపర్చారు. అలాగే వివిధ డిజిటల్ కెమేరాల రివ్యూలు మరియు ఫోటో ఎడిటింగ్ కి సంబంధించిన విషయాలు చాలా చక్కగా వివరించారు.

TinyPic - ఉచిత ఇమేజ్ మరియు వీడియో హోస్టింగ్ సైట్


TinyPic వెబ్ సైట్ లో ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా సైన్ అప్ చెయ్యకుండా ఉచితంగా ఇమేజ్ లేదా వీడియో లను హోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్ లోడ్ చెయ్యబడిన ఇమేజ్ లేదా వీడియో లను సోషల్ నెట్వర్క్, ఫోరమ్, బ్లాగ్,ఈ-మెయిల్ లేదా ఏదైనా వెబ్ సైట్లకు లింక్ చేసుకోవచ్చు. ఇమేజ్ లను రీ సైజ్ చేసుకోవచ్చు, వీడియోలను హై -డెఫినిషన్ లోకి మార్చుకోవచ్చు మరియు ఎడిట్ చేసుకొనే అవకాశం కూడా వుంది. 200MB ఫైల్ సైజ్ వరకు అప్ లోడ్ చేసుకోవచ్చు.

Tinypic® is a fast, simple and reliable video and image hosting site.

CORE Centre - ఆన్ లైన్ కన్సూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం


JAGO GRAHAK JAGO అంటూ ఈ మధ్య టీవీ లో, పత్రికలలో ప్రకటనలు చూస్తున్నాం, వినియోగదారులను చైతన్యపరచటానికి కేంద్రప్రభుత్వ కన్సూమర్ అప్పైర్స్ మంత్రత్వశాఖ ఈ ప్రకటనలను జారీ చేస్తుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ కన్సూమర్ అప్పైర్స్ చే నిర్వహించబడుతున్న CORE Centre (Consumer Online Resource Empowerment Centre)లో వినియోగదారులు ఆన్ లైన్ లోనే ఉత్పత్తిదారులు మరియు సర్వీస్ ప్రొవైడర్ల సేవల పై తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత Complaint Id వస్తుంది, 72 గంటలలో CORE Centre వాళ్ళు మనల్ని సంప్రదిస్తారు. ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్ధలు ఎవరైనా వారి ఉత్పత్తులు లేదా సేవలు సరిగా లేకుంటే వారి పై ఫిర్యాదు చెయ్యవచ్చు. కేవలం ప్రభుత్వ మరియు ప్రభుత్వరంగ సంస్ధలపై ఫిర్యాదు చెయ్యాలంటే కనుక Online Public Grievance Lodging and Monitoring System లో చెయ్యవలసివుంటుంది.

కన్సూమర్ గైడ్, హక్కులు, ఆర్గనైజేషన్లు, కోర్టులు, సంప్రదించవలసిన నంబర్లు మరియు యితర సమాచారం కోసం http://www.corecentre.co.in/ సైట్ ని సందర్శించండి.

కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్


సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దేశం మొత్తం ఎన్నికల వాతావరణంతో వేడెక్కింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ http://eci.nic.in/ ని ఒకసారి సందర్శిద్దాం, ఈ సైట్ లో 2009 ఎలక్షన్ నోటిఫికేషన్, అభ్యర్ధులకు సూచనలు, అప్లికేషన్ ఫార్మ్స్, ఓటర్ గైడ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)కి సంబంధించిన సమాచారం, గతంలో జరిగిన ఎన్నికల వివరాలు, నియోజక వర్గం ప్రకారం గెలుపొందిన అభ్యర్ధుల పేర్లు, యిలా ఎన్నో విషయాలు వున్నాయి.

laptoplogic.com - ఆన్ లైన్ లాప్ టాప్ రివ్యూలు మరియు కొనదలచిన వారికి సలహాల కోసం ....



అన్ని ప్రముఖ బ్రాండెడ్ లాప్ టాప్ ల సంబంధించిన లేటెస్ట్ రివ్యూలు మరియు కొనదలచిన వారికి సలహాల కోసం laptoplogic.com సైట్ ని సందర్శించండి. లాప్ టాప్ ల సంబంధించిన తాజా వార్తలు, టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా తెలుసుకోవచ్చు.

ఇతర సైట్లు: Notebookcheck, Laptop Magazine

W3Schools - ఆన్ లైన్ వెబ్ ట్యుటోరియల్స్


ఉచిత వెబ్ బిల్డింగ్ ట్యుటోరియల్స్, క్విక్ రిఫెరెన్సెస్, కోడ్స్ మరియు వెబ్ డెవలపర్ సర్టిఫికేషన్ కి సంబంధించిన ట్యుటోరియల్స్ కోసం W3Schools సైట్ ని సంప్రదించండి. ఇక్కడ HTML, CSS, XML, JAVASCRIPT, ASP, PHP, SQL, .Net, Multimedia మొదలగు వాటికి సంబంధించిన ట్యుటోరియల్స్, స్టేట్ మెంట్లు,సింటాక్స్ లు, కాపీ మరియు పేస్ట్ చేసుకోవటానికి వీలుగా కోడ్ సహిత ఉదాహరణలు వున్నాయి.

ఉచిత వెబ్ బిల్డింగ్ ట్యుటోరియల్స్ కోసం W3Schools బెస్ట్ సైట్ అని చెప్పవచ్చు.

ఇటువంటిదే మరొక సైట్ Tutorial Point

MedicineNet - హెల్త్ మరియు మెడికల్ సమాచారం కోసం...


హెల్త్ మరియు మెడికల్ సమాచారం కోసం...డాక్టర్ల చే రూపొందించిన MedicineNet సైట్ ని సందర్శించండి. వివిధ ఆరోగ్య సమస్యలు (వ్యాధులు)(Diseases), వాటి లక్షణాలు, అవి ఎలా వస్తాయి, తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయించుకోవలసిన టెస్ట్ లు, మెడికేషన్ మొదలగు వాటి గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన లేటెస్ట్ వార్తలు, పిక్చర్ స్లైడ్ షోలు, మెడ్ టెర్మ్ డిక్షనరీ, వ్యాధిగ్రస్తుల డిస్కషన్లు, వారి ప్రశ్నలు, డాక్టర్ల సమధానాలు యిలా ఎన్నో విషయాలు ఈ సైట్ లో పొందుపర్చారు. వివిధ Diseases అక్షరక్రమంలో వుంచారు లేదా సెర్చ్ కూడా చేసుకోవచ్చు.

ఇలాంటిదే మరొక సైట్: WebMD

గమనిక: పైన చెప్పిన సైట్లు అవగాహన కోసం మాత్రమే ... సమస్యలువుంటే డాక్టర్ ని సంప్రదించండి.

TendersIndia - ది ఇండియన్ గవర్నమెంట్ టెండర్ ఇన్ఫర్మేషన్ సిస్టం




కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వరంగ సంస్థల టెండర్ల సమాచారం కోసం TendersIndia సైట్ ని సందర్శించండి. ఈ సైట్ లో టెండర్ల సమాచారాన్ని ప్రొడక్ట్/సర్వీస్ ల వారీగా, ప్రదేశాల వారీగా, రోజు వారీగా, విలువ ఆధారంగా ఇలా వివిధ వర్గాలు గా వుంచారు. దీనివలన టెండర్లను వెతకటం సులువు అవుతుంది. బిడ్డింగ్ పూర్తి అయిన తర్వాత అది ఎవరికి వచ్చింది అనే సమాచారం కూడా అందుబాటులో వుంటుంది.

FunPhotoBox - Make funny pictures online


మీ ఫోటోలకు ఆన్ లైన్ లో సరదాగా కొన్ని ఎఫెక్ట్ లు జత చెయ్యాలనుకుంటున్నారా ...అదీ కేవలం మూడు స్టెప్పుల్లో ... అయితే FunPhotoBox సైట్ కి వెళ్ళాలి.

౧. ముందుగా ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
౨. సిస్టం నుండి లేదా వెబ్ అడ్రస్ నుండి ఇమేజ్ అప్ లోడ్ చేసుకోవాలి.
౩. ’GO' పై క్లిక్ చేస్తే మన ఫోటో కు మన సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్స్ అప్లై అవుతాయి... ఇక దానిని సేవ్ చేసుకోవటమే

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్ ...


హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్ http://www.htp.gov.in/ లో మీ వెహికిల్ పై వున్న పెండింగ్ ట్రాఫిక్ చలనాలను చూసుకోవచ్చు మరియు ఆన్ లైన్ లో పే చేసే సదుపాయం కూడా వుంది. దీనికోసం సైట్ లో e Challan Status పై క్లిక్ చేసి మీ వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్ పూర్తిగా ఎంటర్ చేస్తే మీ వెహికిల్ పై ఏవైనా పెండింగ్ ట్రాఫిక్ చలనాలు వుంటే ఆ లిస్ట్ వస్తుంది. రాంగ్ చలానా వస్తే ఏంచెయ్యాలి? అనే దాని గురించి, ఇంకా లైవ్ ట్రాఫిక్ అప్ డేట్స్ చూడవచ్చు, రోడ్ రూల్స్ కూడా తెలుసుకోవచ్చు.

ఇంకెందుకు ఆలశ్యం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్ కి వెళ్ళి వెహికిల్ పై ట్రాఫిక్ చలనాలేవైనా పెండింగ్ వున్నయేమో చెక్ చేసుకోండి.

Sarkari Naukri - ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ....

Sarkari Naukri అనే బ్లాగు లో కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల, యూనివర్సిటీలు, కోర్టులు , బ్యాంకులు మొదలగు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం లభిస్తుంది. పోస్ట్ నేమ్ మరియు లాస్ట్ డేట్ వివరాలు వుండటం వలన కావల్సిన వాటినే చూసుకోవచ్చు. ఉద్యోగార్ధులకు ఉపయోగపడే ఒక మంచి బ్లాగ్.... అప్ డేటెడ్ సమాచారం ఇక్కడ లభిస్తుంది... ఈ బ్లాగ్ వెనకవున్న వారి క్రుషి అభినందనీయం....

రాజశ్రీ.కామ్ - Enjoy films.... free


ప్రేమ పావురాలు, ప్రేమాలయం తదితర సూపర్ హిట్ కుటుంబ కధా చిత్రాలను రూపొందించిన రాజశ్రీ సంస్థ ఇప్పుడు తమ వెబ్ సైట్ లో భారతీయ చిత్రాలను ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించింది. దాని కోసం రాజశ్రీ వారి వెబ్ సైట్ http://www.rajshri.com/ ని సందర్శించండి, ఈ సైట్ లో హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ తదితర భాషల చిత్రాలతో పాటు పాటలు, వీడీయోలు , సీన్లు మొదలగునవి ఆన్ లైన్ లో చూసే అవకాశం వుంది కానీ డౌన్లోడ్ చెయ్యలేము. ఆన్ లైన్ లో సినిమాలు చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
తెలుగు సినిమాలు చూడటానికి డైరెక్ట్ లింక్: http://www.rajshritelugu.com/ .

APSRTC ఆన్ లైన్ రిజర్వేషన్

ఎట్టకేలకి APSRTC కుడా ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించింది. ఈ విషయంలో మనకన్నా KSRTC ఒక అడుగు ముందే వుంది. APSRTC ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ కొరకు http://www.apsrtc.in/ సైట్ కి వెళ్ళాలి లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది New User పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి సర్వర్ పై లోడ్ తగ్గించటానికి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే రిజిర్వేషన్ చేసుకొనే వీలు కల్పిస్తున్నారు. అయినా కాని ఒక్కొక్క సారి Server is busy. Please try after sometime...sorry for the inconvenience అనే మెసేజ్ దర్శనమిస్తుంది. ఇంకా బాలారిష్టాలనుండి బయట పడటానికి కొంత సమయం పట్టవచ్చు. అయినా ఇది ఒక మంచి పరిణామం.

Animoto - ఫోటోలకు ఆడియో జతచేసి వీడియో లు తయారుచేసుకోవటానికి ఉచిత ఆన్ లైన్ టూల్

డిజిటల్ ఫోటో లు చూసేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కదా... అయితే ఎందుకు ఆలశ్యం animoto సైట్ కి వెళ్ళి మీ ఫోటోలకు ఆడియో జతచేసి వీడియో స్లైడ్ షో తయారుచేసుకోండి, అదీ సులభంగా... ముందుగా animoto సైట్ కి వెళ్ళి ఈ-మెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకోవాలి . తర్వాత ఈ క్రింది విధంగా చెయ్యండి:

౧. ’Create Video' పై క్లిక్ చేయ్యాలి. Choose your video type లో animoto short ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఫ్రీ. మన సిస్టం నుండి కాని, flickr, facebook, picasa మొ. సైట్ల నుండి కాని ఇమేజెస్ ని అప్ లోడ్ చెయ్యాలి. ఫోటోలకు కావాలంటే టెక్స్ట్ యాడ్ చెయ్యవచ్చు. తర్వాత ’Continue' పై క్లిక్ చెయ్యాలి.

౨. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చెయ్యాలి, మ్యూజిక్ ఫైల్ మన సిస్టం నుండి కాని లేదా animoto సైట్ నుండి కాని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ’Save & Continue' పై క్లిక్ చెయ్యాలి.

౩. ఇక్కడ speed సెలెక్ట్ చేసుకొని ’Continue' పై క్లిక్ చెయ్యాలి. టైటిల్, డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి ’Create Video' పై క్లిక్ చెయ్యాలి.

Processing ----> Analyzing -----> Rendering పూర్తి అయిన తర్వాత వీడియో రెడీ అవుతుంది. దానిని ప్లే చేసుకోవచ్చు లేదంటే 'Video Toolbox' పై క్లిక్ చేసి Edit, Share, Embed మొదలగునవి చేసుకోవచ్చు.

ఇంకెందుకు ఆలశ్యం మీ డిజిటల్ ఫోటోలకు మ్యూజిక్ యాడ్ చేసి ఎంజాయ్ చేస్తూ చూడండి.

మన కంప్యూటర్ రిపేర్ చేసుకోవటానికి ఉపయోగపడే వెబ్ సైట్ ....

fixing my computer అనే వెబ్ సైట్ లో మన కంప్యూటర్ రిపేర్ చేసుకోవటానికి ఉపయోగపడే ట్యుటోరియల్స్ ఉన్నాయి.... డాటా రికవరీ, బ్యాక్ అప్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ టిప్స్, హార్డ్ వేర్ ఇనస్టలేషన్ గైడ్స్ యిలా చాలానే వున్నాయి. డాటా రికవరీ, బ్యాక్ అప్, సెక్యూరిటీ మొదలగు వాటికి సంబంధించిన టూల్స్ వివరాలు కూడా వున్నాయి. సిస్టం ట్రబుల్ షూటింగ్ కి సంబంధించిన ఫ్లోచార్ట్స్ వున్నాయి.



హార్డ్ వేర్ ట్రబుల్ షూటింగ్ నేర్చుకోవాలనుకొనే వారికి ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది.

The Invoice Machine - ఆన్ లైన్ లో ఇన్ వాయిస్ లు తయారుచేసుకోవటానికి ...

The Invoice Machine ని ఉపయోగించి ఆన్ లైన్ లో ఇన్ వాయిస్ లు తయారుచేసుకోవచ్చు. ఇది చిన్న వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా సైట్ లో యూజర్ ఐడి, పాస్ వార్డ్, కంపెనీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ క్లైంట్ల వివరాలు ఎంటర్ చేసుకొని కావలసిన విధంగా ఇన్ వాయిస్ లు తయారు చేసుకోవచ్చు. ఇన్ వాయిస్ లని డైరెక్ట్ గా క్లైంట్ల మెయిల్ ఐడి లకు పీడీఎఫ్ రూపంలో పంపవచ్చు మరియు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ వివరాలు కూడా ఎంటర్ చేసుకొనే సదుపాయం కలదు మరియు ఇన్ వాయిస్ హిస్టరీ కూడా చూడవచ్చు.


The Invoice Machine ని ఉపయోగించే ముందు డెమో చూడవచ్చు, దీనిని ఉపయోగించటం చాలా సులువు.

వెబ్ సైట్:The Invoice Machine

బ్లాగింగ్ ట్యుటోరియల్స్ మరియు ఉచిత టెంప్లేట్స్ కోసం ఒక మంచి సైట్

మీరు క్రొత్తగా బ్లాగ్ ని ప్రారంభించాలను కొంటున్నారా... ఆల్రెడీ వున్న బ్లాగ్ ని అందంగా మరియు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనుకొంటే కనుక బ్లాగింగ్ ట్యుటోరియల్స్ మరియు ఉచిత టెంప్లేట్స్ కోసం http://www.blogspottutorial.com/ సైట్ ని సందర్శించండి. ఇక్కడ ట్యుటోరియళ్ళు సచిత్రంగా స్క్రీన్ షాట్ల తో స్టెప్ బై స్టెప్ సులభంగా అర్ధమయ్యేరీతిలో ఉంటాయి. అలానే ఉచిత టెంప్లేట్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.



ఇది బ్లాగర్స్ కి ఉపయోగపడే ఒక మంచి సైట్...

Blogger కీ బోర్డ్ షార్ట్ కట్స్:

[Ctrl] + [B] - Bold
[Ctrl] + [I] - Italic
[Ctrl] + [L] - Blockquote
[Ctrl] + [Z] - Undo
[Ctrl] + [Y] - Redo
[Ctrl] + [Shift] + [A] - Add hyperlink
[Ctrl] + [Shift] + [P] - Preview
[Ctrl] + [D] - Save as draft
[Ctrl] + [P] - Publish
[Ctrl] + [S] - Save
[Ctrl] + [G] - Indic script transliteration

Jotti's malware scan - 20 యాంటీ-వైరస్ ప్రోగ్రాములను ఉపయోగించి మీ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్కాన్ చేసుకోండి...

Jotti's malware scan సైట్ లో దాదాపు 20 ప్రముఖ యాంటీ-వైరస్ ప్రోగ్రాములను ఉపయోగించి మీ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్కాన్ చేసుకోవచ్చు. Jotti's malware scan సైట్ కి వెళ్ళి ’Browse' పై క్లిక్ చేసి స్కాన్ చెయ్యవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Submit file' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఫైల్ అప్ లోడ్ చెయ్యబడి దాదాపు ౨౦ ప్రముఖ యాంటీ వైరస్ ప్రోగ్రాములైన Bit Defender, Clam AV, NOD 32, Mormon, AVG, A-Squared, Dr. Web, Avast మొ. వాటితో ఫైల్ స్కాన్ చెయ్యబడి స్కాన్ రిజల్ట్ చూపెడుతుంది.






వెబ్ సైట్ : Jotti's malware scan

PHOTOSnack - ఉచితంగా ఫోటో స్లైడ్ షోస్ తయారుచేసుకోవటానికి...

PHOTOSnack - ఆన్ లైన్ లో ప్రొఫెషనల్ ఫోటో స్లైడ్ షోస్ తయారుచేసుకోవటానికి ఒక సులభమైన మార్గం ... ముందుగా photosnack అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.


స్టెప్ ౧. UPLOAD: PHOTOSnack సైట్ కి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత 'Make a Slideshow' పై క్లిక్ చెయ్యాలి, టెంఫ్లేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ’Upload Photos' పై క్లిక్ చేసి గరిష్టంగా 250 MB వరకు ఒక్కొక్క ఫైల్ సైజ్ 10 MB వరకు jpg, jpeg, png and gif ఫార్మేట్ లో వున్న ఫైళ్ళను అప్ లోడ్ చేసుకోవాలి.

స్టెప్ ౨. CUSTOMIZE: Customize Album లో ఆల్బమ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, ఇమేజ్ జతచెయ్యవచ్చు, వ్యక్తిగత లోగో జత చెయ్యవచ్చు. అలాగే Navigation లో స్లైడ్ షో స్పీడు, యూజర్ ఇంటరాక్షన్ మరియు ఆటో హైడ్ కంట్రోల్స్ సెట్ చేసుకోవచ్చు.

స్టెప్ ౩. SHARE: తయారుచేసుకొన్న ఆల్బమ్ ని ఇతరులతో పంచుకోవటానికి లింక్ మరియు ఎంబెడ్ కోడ్ వస్తాయి.

CutMyPic - Cut & Customize your picture

CutMyPic అనే వెబ్ సైట్ కి వెళ్ళి ఇమేజ్ లో కావల్సిన భాగాన్ని సెలెక్ట్ కొని రీ-సైజ్ చేసుకోవచ్చు అదీ కేవలం మూడేమూడు స్టెప్పుల్లో

స్టెప్ ౧. CutMyPic సైట్ కి వెళ్ళి ’Browse' పై క్లిక్ చేసి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ’Go' పై క్లిక్ చెయ్యాలి.

స్టెప్ ౨. ఇమేజ్ లో కావల్సిన భాగాన్ని సెలెక్ట్ చేసుకొని ’Preview' బటన్ పై క్లిక్ చేసి ప్రివ్యూ చూసిన తర్వాత ’Done' పై క్లిక్ చెయ్యాలి.

స్టెప్ ౩. ఇప్పుడు ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ఈ-మెయిల్ కూడా పంపవచ్చు.

ఇలాంటివే మరికొన్ని వెబ్ సైట్లు Pixenate, rsizr, Resize Your Image .

SMSjosh - ఉచిత సంక్షిప్త సందేశాలు పంపటానికి మరొక సైట్

ఇండియాలో ఏదైనా మొబైల్ కి ఉచిత SMS లు పంపటానికి చాలా వెబ్ సైట్లు వున్నాయి ... గత మాసం కంప్యూటర్ ఎరా పాఠకుల సమావేశం లో SMSjosh సైట్ గురించి తెలుసుకోవటం జరిగింది... SMSjosh నుండి కూడా ఇతర సైట్ల మాదిరిగా ఇండియాలో ఏదైనా మొబైల్ కి ఉచిత SMS లు పంపవచ్చు కాకపోతే ఈ సైట్ లో ఇతర సైట్ల లా ప్రకటనల గజిబిజీ మరియు కన్పూజన్ లేకుండా చూడచక్కగా వుంది అంతేకాకుండా ఉచిత అకౌంట్ లో ఒకేసారి 5 మొబైల్ నంబర్లకు గరిష్టంగా 120 అక్షరాల వరకు మెసేజ్ పంపవచ్చు.

వెబ్ సైట్: SMSjosh

WeTransfer - పెద్ద ఫైళ్ళు ట్రాన్స్ ఫర్ చెయ్యటానికి...

ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా 2 GB వరకు చిన్న లేదా పెద్ద ఫైళ్ళను WeTransfer సైట్ కి వెళ్ళి ఉచితంగా కావల్సిన వారికి పంపవచ్చు.


ముందుగా https://www.wetransfer.com/ సైట్ కి వెళ్ళి Add Files పై క్లిక్ చేసి పంపవలసిన ఫైళ్ళను 2GB వరకు యాడ్ చేసుకోవచ్చు. Enter friend's email address దగ్గర ఫైల్స్ ఎవరికైతే పంపాలో వారి ఈ-మెయిల్ అడ్రస్ ఎంటర్ చెయ్యాలి. Enter your email address దగ్గర మన మెయిల్ ఐడి ఎంటర్ చేసి ’Transfer' బటన్ పై క్లిక్ చెయ్యాలి. మనం పంపిన ఫైళ్ళ డౌన్లోడ్ లింక్ ఫ్రెండ్స్ ఈ-మెయిల్ ఐడి కి పంపబడుతుంది. దానిపై క్లిక్ చేసి ఫైళ్ళను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైళ్ళు 2 వారాల వరకు డౌన్లోడ్ కి అందుబాటులో వుంటాయి. అంతేకాకుండా ఒకేసారి 20 మెయిళ్ళకు పంపే సదుపాయం కలదు.

వెబ్ సైట్: https://www.wetransfer.com/

Drawspace - ఆన్ లైన్ లో డ్రాయింగ్ నేర్చుకోవటానికి!

పిల్లలు, పెద్దలు ఎవరైనా సులభ పధ్ధతుల్లో ఉచితంగా డ్రాయింగ్ నేర్చుకోవాలనుకొంటే కనుక Drawspace సైట్ కి వెళ్ళాల్సిందే, ఇక్కడ డ్రాయింగ్ నేర్చుకోవటానికి ఎన్నో పాఠాలున్నాయి, వాటిని Beginner, Intermediate, Advaced అనే మూడు విభాగాలుగా విభజించారు. ఇక్కడ సాధారణ డ్రాయింగ్, షేడింగ్, క్యారికేచర్, కార్టూన్లు మొదలగు వాటిని అందంగా మరియు ఆకర్షణీయంగా గీయటానికి ఎన్నో పాఠాలున్నాయి.


ఇంకా... ఎందుకు ఆలశ్యం Drawspace సైట్ కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడవున్న పాఠాల ద్వారా అందమైన బొమ్మలు గీయటం మొదలు పెట్టండి.

వెబ్ సైట్: Drawspace