Friday, October 1, 2010

పి.డి.ఎఫ్./ PDF




PDF అంటే Portable Document Format.
మన దగ్గరున్న ఏదైనా సమాచారం కాని డాక్యుమెంట్ కాని భద్రపరుచుకోవడానికి ,సులువుగా పంపిణీ చేయడానికి ఆ సమాచారాన్ని పి.డి.ఎఫ్ చేస్తాము.అంటే ప్రతీ పేజీని ఒక చిత్రంలా భద్రపరచడం. దాన్ని పుస్తకంలా తయారు చేయడం. ఇలా చేయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం.

* మన సమాచారాన్ని చిత్రంలా బంధించి , భద్రపరిచాము కాబట్టి అవతలి వారి కంప్యూటర్లో సులువుగా చూడగలుగుతారు. వాళ్లు ఎటువంటి సాఫ్ట్ వేర్,ఆపరేటింగ్ సిస్టం వాడినా సరే.

* మన ఫైలులో వాడిన బొమ్మలు,గుర్తులు,ఫాంట్లు ..ఎలాగున్నవి అలాగే మార్పులేకుండా చూడొచ్చు.మామూలు డాక్యుమెంట్ లా పంపిస్తే కొంచం కష్టమవుతుంది.

* ఈ పద్ధతిలో పంపిన సమాచారం ఎటువంటి ప్రింటర్ లో అయినా ప్రింట్ చేసుకోవచ్చు.

* ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్, పుస్తకాల పబ్లిషింగ్ కోసం పిడిఎఫ్ చేయడాం చాలా ఉపయోగకరమైనది.

* అంతర్జాలంలో ముఖ్యమైన సమాచారాన్ని పిడిఎఫ్ రూపంలో పెడితే దానిని కాపీ చేసుకోవడం కుదరదు.అదే మామూలుగా డాక్యుమెంట్ లా ఉంటే సులువుగా కాపీపేస్ట్ చేసుకోవచ్చు. కష్ట పడి తయారు చేసిన సమాచారాన్ని భద్రపరుచుకోవడానికి ఇది సులువైన మార్గం.

* ఇక తెలుగు విషయానికొస్తే... పుస్తకాలు,పత్రికలవాళ్ళు ఉపయోగించేది అను,శ్రీలిపి ఫాంట్లు.అవి యూనికోడ్ లో సరిగ్గా కనిపించవు.మళ్ళీ యునికోడ్ లో రాయాలంటే కష్టం.లేదా అవతలి వారి సిస్టంలో కూడా ఆ సాఫ్ట్ వేర్ ఉండాలి.అదే వ్యాసాలూ పిడిఎఫ్ చేసి పంపిస్తే ఎలాటి ఇబ్బంది లేకుండా చూడగలం. అందుకే పత్రిక రంగంలోని వారికి ఈ పధ్ధతి చాలా ఉపయోగకరమైనది.

* ఎక్స్.పి తర్వాత అన్ని ఆపరేటింగ్ సిస్టంలలో వాడే ఫాంట్ గౌతమి. కాని అంతకు ముందు వాడే ఆపరేటింగ్ సిస్టంలలో ఇది కనిపించదు. మరి ఎలా. మన వ్యాసం కాని ఉత్తరం కాని సమాచారం కాని వాళ్లు చదవాలంటే ఎలా. పిడిఎఫ్ చేసి పంపిస్తే చాలు. ఇందులో రాత మొత్తం బొమ్మలా మార్చబడుతుంది కాబట్టి ఇంచక్కా తెలుగులోనే కనిపిస్తుంది.

* మీరు బ్లాగులో ఒక విషయంపై పది టపాలు రాసారనుకోండి. వాటిని ఒక దగ్గర ప్రోగు చేసి ఒక డాక్యుమెంట్ లా లేదా పుస్తకం లా చేసి పెడితే బావుంటుంది కదా.ఎవరికైనా పంపించవచ్చు. డాక్యుమెంట్ పెద్దగా ఉంటుంది .చదవడం కష్టంగా ఉంటుంది.అదే పిడిఎఫ్ చేసి పంపితే పుస్తకంలా చదువుకుంటారు.

ఈ పిడిఎఫ్ ఎలా చేయాలి. ఎలా చదవాలి అనే విషయాలు ఇపుడు చూద్దాం.

మనకు ఒక పిడిఎఫ్ ఫైల్ వచ్చింది.లేదా చదవాలి . దానికోసం రీడర్ కావాలి. ఇది డౌన్లోడ్ చేసి మీ సిస్టం లో భద్రపరుచుకోండి.


Adobe Reader

Foxit Reader


పిడిఎఫ్ చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి.
1. Microsoft Word లో చిన్న యాడ్ ఆన్ చేరిస్తే మన డాక్యుమెంట్ తయారుకాగానే పిడిఎఫ్ లా వెంటనే చేసుకోవచ్చు.

2. Openoffice లో కూడా మన డాక్యుమెంట్ కాగానే పిడిఎఫ్ లా మార్చుకుని సేవ్ చేసుకోవచ్చు.

౩. Cute PDF writer

3. PDF converter

4. PDF995

5. Primo PDF

6.DoPDF


పిడిఎఫ్ గురించి మరికొన్ని ఉపయోగాలు

No comments:

Post a Comment