క్రొత్త కంప్యూటర్ కొన్నప్పుడు లేదా ఉన్న కంప్యూటర్ ఫార్మేట్ చేసినప్పుడు ఇంటర్నెట్ లో దొరికే ఉచిత అప్లికేషన్లను ఒకేసారి డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చెయ్యాలంటే కనుక AllMyApps సైట్ కి వెళ్ళాల్సిందే.
ఇక్కడ వివిధ ఉచిత అప్లికేషన్లను వివిధ క్యాటగిరీల్లో వుంచారు.
ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా కావలసిన అప్లికేషన్ పై మౌస్ వుంచితే 'Inastall' లేదా '+ List' వస్తాయి, '+ List' పై మౌస్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్లు మన లిస్ట్ (My List)కి యాడ్ చెయ్యబడతాయి వాటిని ఒకేసారి డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. లిస్ట్ చేసినవి వద్దు అనుకుంటే మౌస్ ఆ అప్లికేషన్ పై వుంచితే '- Unlist' వస్తుంది, అప్పుడు దానిపై క్లిక్ చెయ్యాలి.
వెబ్ సైట్:AllMyApps
No comments:
Post a Comment