మనం స్నేహితుల కంప్యూటర్ల నుండి పెన్‌డ్రైవ్‌ల ద్వారా డేటాని కాపీ చేసుకు వచ్చేటప్పుడు పెన్ డ్రైవ్‌ని మన USB పోర్ట్‌కి కనెక్ట్ చేసిన వెంటనే Autorun చేయబడేలా మన సిస్టం కాన్ఫిగర్ చేయబడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే అధిక శాతం వైరస్‌లు autorun అవడం ద్వారా వ్యాపించే విధంగా కోడ్ రాయబడి ఉంటాయి. ఇలా పెన్ డ్రైవ్‌ని కనెక్ట్ చేసిన వెంటనే అది autorun అవకుండా నిలిపివేయగలిగితే అందులో ఉన్న వైరస్ దానంతట అది మన సిస్టమ్‌లోకి ప్రవేశించకుండా రక్షించుకోవచ్చు కదా.. అందుకోసం ఒక చిన్న చిట్కా. పెన్ డ్రైవ్‌ని USB పోర్ట్‌కి కనెక్ట్ చేసిన వెంటనే కొద్ది క్షణాలపాటు కీబోర్డ్‌పై ఉండే Shift కీని ప్రెస్ చేసి ఉంచండి. దాంతో autorun నిలిపివేయబడుతుంది. ఆ తర్వాత మీ కంప్యూటర్లో ఉండే ఏంటివైరస్ సాఫ్ట్ వేర్‌తో వైరస్ స్కాన్ చేసి శుభ్రంగా ఉన్న ఫైళ్లని మాత్రమే కాపీ చేసుకుని మీ పెన్ డ్రైవ్‌ని ఫార్మేట్ చేస్తే దాని నుండి వైరస్ తొలగిపోతుంది.
No comments:
Post a Comment