Tuesday, October 26, 2010

Kaspersky Rescue Disk - పీసీ నుండి వైరస్ లను తొలగించటానికి ఒక సురక్షితమార్గము!!!

మన పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన యాంటీ-వైరస్ సాప్ట్ వేర్లు లేదా మరి ఏ యితర సాప్ట్ వేర్లు వైరస్ లను తొలగించటం లో విఫలమైనప్పుడు ఇన్ఫెక్టెడ్ పీసీ ని Kaspersky Rescue Disk తో బూట్ అవ్వడం వలన ఆ పీసీ లోని త్రెట్స్ ని సమర్ధవంతంగా తొలగించవచ్చు. ముందుగా Kaspersky Rescue Disk ISO ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని ఒక CD లో బర్న్ చేసుకోవాలి. bootable USB disk కి కూడా టూల్ దొరుకుతుంది. ఈ CD ని ఇన్ఫెక్టెడ్ సిస్టం సీడీ-రామ్ డ్రైవ్ లో ఉంచి, పీసీ BIOS లో Boot from CD ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని సిస్టం రీబూట్ చెయ్యాలి. Kaspersky Rescue Disk ఉపయోగించటం కూడా చాలా సులువు, ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇది వైరస్ స్కానింగ్ ఇంటర్‌ఫేస్ నే కలిగి ఉంటుంది.



అవసరమైతే స్కాన్ చేసేముందు My Update Centre టాబ్ కి వెళ్ళి Kaspersky Rescue Disk డాటాబేస్ ని అప్‌డేట్ చేసుకోవాలి. మరింత సమాచారం కోసం Kaspersky సైట్ చూడండి.

డౌన్లోడ్: Kaspersky Rescue Disk

ఇటువంటిదే మరొక సాప్ట్ వేర్ BitDefender Rescue CD

No comments:

Post a Comment