విండోస్ లైవ్ ఉపకరణాలన్నీ ఇప్పుడు తెలుగులో లభ్యమవుతున్నాయి. http://download.live.com (ఈ పేజికూడా తెలుగులో కనిపిస్తుంది) కు వెళ్లి లైవ్ రైటర్, మెసెంజర్, ఫోటో గాలరీ మొదలైన వాటినన్నింటినీ నుండి డౌన్లోడు చేసుకొనండి. ఈ ఉపకరణాలన్నీ తెలుగు ఇంటర్ఫేసును కలిగి ఉన్నాయి.
ఈ ఉపకరణాలే కాకుండా విండోసు లైవ్ స్పేసులోని ఆన్లైను సర్వీసులు కూడా తెలుగు ఇంటర్ఫేసుతో మనం వాడుకొనడానికి సిద్దంగా ఉన్నాయి. http://spaces.live.com/ కు వెళ్లి మీరు ఒక బ్లాగును సృష్టించుకోవచ్చు, skydrive ను ఉపయోగించి 25జిబి వరకు మీ ఫైళ్లను ఎగుమతి చేసుకొనవచ్చు ఇంకా ఫోటోలు గట్రా ఎగుమతి చేసుకోవచ్చు. UI కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగు పడింది.
No comments:
Post a Comment