ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా 2 GB వరకు చిన్న లేదా పెద్ద ఫైళ్ళను WeTransfer సైట్ కి వెళ్ళి ఉచితంగా కావల్సిన వారికి పంపవచ్చు.
ముందుగా https://www.wetransfer.com/ సైట్ కి వెళ్ళి Add Files పై క్లిక్ చేసి పంపవలసిన ఫైళ్ళను 2GB వరకు యాడ్ చేసుకోవచ్చు. Enter friend's email address దగ్గర ఫైల్స్ ఎవరికైతే పంపాలో వారి ఈ-మెయిల్ అడ్రస్ ఎంటర్ చెయ్యాలి. Enter your email address దగ్గర మన మెయిల్ ఐడి ఎంటర్ చేసి ’Transfer' బటన్ పై క్లిక్ చెయ్యాలి. మనం పంపిన ఫైళ్ళ డౌన్లోడ్ లింక్ ఫ్రెండ్స్ ఈ-మెయిల్ ఐడి కి పంపబడుతుంది. దానిపై క్లిక్ చేసి ఫైళ్ళను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైళ్ళు 2 వారాల వరకు డౌన్లోడ్ కి అందుబాటులో వుంటాయి. అంతేకాకుండా ఒకేసారి 20 మెయిళ్ళకు పంపే సదుపాయం కలదు.
వెబ్ సైట్: https://www.wetransfer.com/
No comments:
Post a Comment