Thursday, September 30, 2010

గూగుల్ సెర్చ్ లో అడల్ట్ కంటెంట్ బ్లాక్ చెయ్యటం ఎలా?

మన పిల్లలు గూగుల్ లో దేని కోసమైనా సెర్చ్ చేసినప్పుడు అడల్ట్ కంటెంట్ వుండే టెక్స్ట్, ఇమేజెస్, వీడీయో లేదా లింకులు రాకుండా గూగుల్ సెర్చ్ సెట్టింగ్స్ లో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం ద్వారా వాటిని నిరోధించవచ్చు. దాని కోసం ఈ క్రింది విధంగా చెయ్యండి.

౧. మీ డీపాల్ట్ బ్రౌజర్ లో గూగుల్ సెర్చ్ (http://www.google.com/)సైట్ ని ఓపెన్ చెయ్యాలి. సెర్చ్ పేజీలో కుడి చేతి ప్రక్క పైన వున్న ’Search Settings’ పై క్లిక్ చెయ్యాలి.



౨. ఇప్పుడు Google Preferences పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Safe Search Filtering దగ్గర Google's SafeSearch లో వున్న ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ డు సెట్టింగ్స్ కోసం 'LockSafeSearch' పై క్లిక్ చెయ్యాలి.



౩. ఇప్పుడు గూగుల్ ఎకౌంట్ యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ యిచ్చి sign in చెయ్యాలి.



౪. Google Safeserch Filtering పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ’Lock SafeSearch' బటన్ పై క్లిక్ చెయ్యాలి.





౫. అన్ని సెర్చెస్ కి Safe Search లాక్ అయిన తర్వాత ’Back to Search settings' పై క్లిక్ చెయ్యాలి.



౬. ఇప్పుడు గూగుల్ ప్రిఫెరెన్సెస్ పేజ్ కి వెళతాము. క్రింద వున్న ’Save Preferences' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

No comments:

Post a Comment