Thursday, September 30, 2010

CORE Centre - ఆన్ లైన్ కన్సూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం


JAGO GRAHAK JAGO అంటూ ఈ మధ్య టీవీ లో, పత్రికలలో ప్రకటనలు చూస్తున్నాం, వినియోగదారులను చైతన్యపరచటానికి కేంద్రప్రభుత్వ కన్సూమర్ అప్పైర్స్ మంత్రత్వశాఖ ఈ ప్రకటనలను జారీ చేస్తుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ కన్సూమర్ అప్పైర్స్ చే నిర్వహించబడుతున్న CORE Centre (Consumer Online Resource Empowerment Centre)లో వినియోగదారులు ఆన్ లైన్ లోనే ఉత్పత్తిదారులు మరియు సర్వీస్ ప్రొవైడర్ల సేవల పై తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత Complaint Id వస్తుంది, 72 గంటలలో CORE Centre వాళ్ళు మనల్ని సంప్రదిస్తారు. ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్ధలు ఎవరైనా వారి ఉత్పత్తులు లేదా సేవలు సరిగా లేకుంటే వారి పై ఫిర్యాదు చెయ్యవచ్చు. కేవలం ప్రభుత్వ మరియు ప్రభుత్వరంగ సంస్ధలపై ఫిర్యాదు చెయ్యాలంటే కనుక Online Public Grievance Lodging and Monitoring System లో చెయ్యవలసివుంటుంది.

కన్సూమర్ గైడ్, హక్కులు, ఆర్గనైజేషన్లు, కోర్టులు, సంప్రదించవలసిన నంబర్లు మరియు యితర సమాచారం కోసం http://www.corecentre.co.in/ సైట్ ని సందర్శించండి.

No comments:

Post a Comment