Thursday, September 30, 2010

http://irctc.co.in/ - ఆన్ లైన్ రైల్వే పాసింజర్ రిజర్వేషన్ సైట్


రైల్వే టికెట్ రిజర్వేషన్ కోసం గంటలకొద్దీ కౌంటర్ల దగ్గర నిలబడే కన్నా, Indian Railway Catering and Tourism corporation Ltd. వారి http://irctc.co.in/ ద్వారా ఆన్ లైన్ లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. యూజర్ ఐడి మరియు పాస్ వార్డ్ కోసం ముందుగా సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. యూజర్ ఐడి ఈ-మెయిల్ కి పంపబడుతుంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వుపయోగించి రెండు విధాలుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు ఒకటి i-ticket - టికెట్ మన అడ్రస్ కి పోస్ట్/కొరియర్ లో పంపబడుతుంది. రెండవది e-ticket - ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకొని అప్పుడే ప్రింట్ తీసుకోవచ్చు., ఈ పధ్ధతిలో పాసింజర్ ఫొటో ఐడి వివరాలు ఇవ్వాలి. ప్రయాణించేటప్పుడు మనతోపాటు ఫొటో ఐడి తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ టికెట్ కాన్సిల్ చెయ్యవలసివస్తే ఆన్ లైన్ లోనే చెయ్యవచ్చు.

No comments:

Post a Comment