Saturday, October 23, 2010

Pen Drive ని NTFS లో ఫార్మేట్ చెయ్యటం ఎలా?

ముందుగా Pen Drive ని ప్లగ్ ఇన్ చెయ్యాలి, ’My Computer' ఓపెన్ చేసి, Pen Drive పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Properties' సెలెక్ట్ చేసుకోవాలి. ’Properties' లోని ’Hardware' టాబ్ లో USB Drive ని సెలెక్ట్ చేసుకొని, క్రిందవున్న ’Properties' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు ఓపెన్ అయిన విండోలో ’Policies' టాబ్ లో ’Optimize for Performance' అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని ’OK' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు మరల ’My Computer' ఓపెన్ చేసి, Pen Drive పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Format' పై మౌస్ క్లిక్ చెయ్యాలి, Format లో File System 'NTFS' సెలెక్ట్ చేసుకొని ’Start' బటన్ పై క్లిక్ చెయ్యాలి.







పెన్ డ్రైవ్ ని FAT నుండి NTFS కి మార్చటానికి ఇంకొక పధ్ధతి:

Pen Drive ని ప్లగ్ ఇన్ చెయ్యాలి, తర్వాత Start---> Run కి వెళ్ళి అక్కడ cmd అని టైప్ చేసి [Enter] ప్రెస్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది, అక్కడ convert [pen Drive Letter]:/fs:ntfs అనే కమాండ్ ఎంటర్ చెయ్యాలి. ఉదా: c:\>convert f:/fs:ntfs (ఇక్కడ f అనేది డ్రైవ్ లెటర్)

No comments:

Post a Comment