Wednesday, October 27, 2010

యూట్యూబ్ నుండి వీడియో డౌన్ లోడ్ చెయ్యటం ఎలా?

నెట్ లో వీడియోలు చూడాలంటే అందరూ ఎక్కువగా చూసే సైట్ యూట్యూబ్ (www.youtube.com), దీట్లోంచి వీడియోలు క్యాప్చర్ చెయ్యటానికి చాలా పధ్దతులు వున్నాయి. ఇక్కడ యూట్యూబ్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చెయ్యటానికి సులువైన పధ్ధతిని వివరిస్తున్నాను.
1.ముందుగా యూట్యూబ్ (www.youtube.com)వెళ్ళి, కావలసిన వీడియోను ఎంపిక చేసుకొని క్లిక్ చెయ్యాలి

2.వీడియో ఓపెన్ అయిన తర్వాత వెబ్ పేజ్ అడ్రస్ లింకు ని సెలెక్ట్ చేసుకొని కాపీ ([Ctrl]+[c]) చేసుకోవాలి

3.ఇప్పుడు http://viddownloader.com/ అనే సైట్ కి వెళ్ళాలి

4.ఇప్పుడు viddownloader లో "Copy the link of the page with the video and paste it here" దగ్గర ఇందాక యూట్యూబ్ లో కాపీ చేసిన వీడియో లింకును paste ([Ctrl]+[v]) చెయ్యాలి. తర్వాత ’GET VIDEO' బటన్ పైక్లిక్ చెయ్యాలి.

5.’DOWNLOAD FILE' పై క్లిక్ చెయ్యాలి.

6.ఫైల్ డౌన్లోడ్ విండో ఓపెన్ అవుతుంది, కావలసిన లొకేషన్ లో దానిని సేవ్ చేసుకోవచ్చు


7.'get_video' అనే పేరుతో సేవ్ చెయ్యబడిన ఫైల్ ని మనకు నచ్చిన పేరుతో రీనేమ్ (Rename) చేసి చివరన .flv అనే ఎక్స్ టెన్షన్ ఇవ్వాలి.(ఉదా:myvideo.flv). మీ సిస్టం లో FLV Player వుంటే డౌన్ లోడ్ చేసిన వీడియోను దానిలో ప్లే చేసుకోవచ్చు. లేకుంటే FLV Player ను http://www.download.com/FLV-Player/3000-2139_4-10467081.html?hhTest=1 నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment