Friday, October 1, 2010

కొత్త బ్లాగర్లకు సూచనలు

కొత్తగా బ్లాగు మొదలెట్టాలని అనుకున్నారు. మంచిదే. బ్లాగర్ కి వెళ్ళి మీకంటూ ఒక సొంత బ్లాగు మొదలు పెట్టారు. అంతటితో పని పూర్తవ్వలేదుగా.. బ్లాగు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు, తర్వాత కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే మంచిది. అవి ఏంటో యిపుడు చూద్దాం..


ముందుగా బ్లాగు మొదలెడుతున్నాం. దానికోసం మంచి శీర్షిక లేదా టైటిల్ ఆలోచించి పెట్టుకోండి. ఎదో ఒకటి పెడితే ఎలా?. మన బ్లాగు అంటే మన సొంతిల్లు లాంటిది. అందమైన ఇంటికి అందమైన పేరు ఉండాలిగా?. బ్లాగు మొదలుపెట్టేటప్పుడు టైటిల్ ఇంగ్లీషులో ఇచ్చినా తర్వాత సెట్టింగ్స్ లో తెలుగులోకి మార్చుకోవచ్చు. తెలుగు బ్లాగు పేరు కూడా తెలుగులోనే ఉంటే బావుంటుంది కదా. అలాగే దానికో అందమైన ట్యాగ్ లైన్ కూడా పెట్టండి. ఇంకా అందంగా ఉంటుంది. మరో విషయం. మీరు బ్లాగు మొదలుపెట్టేటప్పుడు బ్లాగు అడ్రస్ అదేనండి url కూడా అందరికి మీకు కూడా ఈజీగా గుర్తుండేట్టు, సింపుల్ గా ఉండేట్టు చూసుకోండి.




dashboard నుండి settings Formattingకి వెళ్ళండి. అక్కడ ముందుగా చేయవలసిన ముఖ్యమైన మార్పులు. ప్రతి పేజిలో మూడు నుండి ఐదు పోస్టులు మాత్రమే వచ్చేట్టు చూడండి. ఎక్కువ టపాలు ఉంటే మీ బ్లాగ్ ఓపన్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. తర్వాత మీ పోస్టు ప్రచురించే తేది, సమయం గురించి పైన చెప్పినట్టుగా మార్చుకోండి.



ఇక కొత్త బ్లాగర్లు చేయవలసిన మరో ముఖ్యమైన పని.. కామెంట్లు రాసేవారికి పంటి కింది రాయిలా వచ్చే వర్డ్ వెరిఫికేషన్.
settings > comments విభాగంలో ఈ వర్డ్ వెరిఫికేషన్ కావాలా వద్దా అన్నదగ్గర వద్దు అనండి. అలాగే బ్లాగులో ఎవరైనా కామెంట్ రాయగానే మీకు తెలిసేట్టు మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఒకవేళ మీరు కామెంట్స్ మాడరేషన్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఆ విధంగా మార్పు చేసుకోవచ్చు.

ఇక కొత్త బ్లాగర్లకు మరి కొన్ని సూచనలు.

బ్లాగు మొదలుపెట్టినందుకు అభినందనలు. ముందు మీరు ఏయే విషయాలు రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అలా అని ఒకే విధమైన రాతలు రాయాలని కాదు. మీ బ్లాగు మీ ఇష్టం. ఏదైనా విషయం పై టపా రాయాలంటే ముందు దానికి సరిపోయే విధంగా, అందరిని ఆకట్టుకునే విధంగా ఉండేట్టు టైటిల్ ఎంచుకోండి. తర్వాత మీ టపా రాయండి. వీలయితే దానికో చిత్రం పెట్టండి. మర్చిపోకుండా ప్రతి టపాకు లేబిల్ లేదా వర్గం ఇవ్వండి. తర్వాత మీరు కాని మీ బ్లాగు చదివేవారు కానీ పాట టపాలు చదవాలంటే ఆ వర్గాలు చాలా ఉపయోగపడతాయి. మీరు బ్లాగు మొదలుపెట్టగానే అందరూ పొలోమని వచ్చేయరు కదా. మరి ఎలాగంటారా. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే... మీ బ్లాగులోనీ టపా కత్తి కూర్చోకుండా మిగతా బ్లాగులకు వెళ్ళి టపాలు చదివి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. లేదంటే ఎందుకు నచ్చలేదో చెప్పండి. అలా చేస్తుంటే మీ గురించి పదిమందికి తెలుస్తుంది. మీ గురించి మీరే ఇరుగు పొరుగుకు పరిచయం చేసుకోవాలన్నమాట. మెల్లిగా ఇతర బ్లాగర్లు ఎవరా ఈ కొత్త వ్యక్తి అని మీ పేరు ఉన్న లంకె పట్టుకుని మీ బ్లాగుకు వచ్చి మీరు రాసిన టపా చదువుతారు. అలాగే మీ గురించి కొన్ని విషయాలు మీ ప్రొఫైల్ లో పెట్టండి. మరీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు లెండి..

మరి మీరు రాసిన టపా అందరికి తెలియాలంటే ఎలా.. తెలుసుగా బ్లాగు సంకలినులు లేదా ఆగ్రిగేటర్లలో చేరాలి.


కూడలి ---- support@koodali.org
మాలిక -... admin@maalika.org
జల్లెడ --- http://dir.jalleda.com/index.php?show=add&PID=79

హారం --- http://haaram.com/Join.aspx
తెలుగు బ్లాగర్స్ ... http://www.telugubloggers.com/add-blog/

అగ్రిగేటర్స్ వివరాలు తెలుసుకున్నారుగా. మరి మీకు అప్పుడప్పుడు వచ్చే సందేహాలకు సమాధానాల కోసం , బ్లాగులకు, అంతర్జాలంలో తెలుగుకు సంబంధించిన చర్చలకోసం తెలుగు బ్లాగు గుంపులో చేరండి. http://groups.google.co.in/group/telugublog ఎవరో ఒకరు మీకు సమాధానమిస్తారు. సందేహాలు , సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారు.

No comments:

Post a Comment