Thursday, May 5, 2011

POST NEXT DAY

మీ బ్లాగులో టపా రాయాలంటే దానికి సమయం కేటాయించి కూర్చుని రాయాలి.పబ్లిష్ చేయాలి. ఒక్కోసారి అలా కుదరకపోవచ్చు. ఇపుడు రాసి పెట్టి ,రెండు రోజుల తర్వాత లేదా మీకు కావలసిన రోజు పబ్లిష్ అయ్యేలా చేస్తే ఎలా ఉంటుంది. బావుంటుంది కదా. సౌకర్యంగా కూడా ఉంటుంది. ఒకేసారి పది టపాలు కూడా అలా సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఒక్కో టపా ఒక్కో నిర్ధారిత సమయంలో,తేదీలో ప్రచురింపబడేట్టు.. దానికోసం చిన్న చిట్కా బ్లాగులోనే దొరుకుతుంది.


మామూలుగా మనం బ్లాగులోకి లాగిన్ కావాలంటే http://www.blogger.com/ కి వెళతాము కదా. టపా ఇలా మన ను మరో రోజు,సమయంలో పబ్లిష్ చేయాలంటే http://www.draft.blogger.com/లో లాగిన్ కావాలి. ఎప్పటిలాగే మీ టపాను రాసుకుని క్రింద ఎడమవైపు post options అని ఉంటుంది.అది క్లిక్ చేసి మీకు కావలసిన తేది, సమయం ఇచ్చి పబ్లిష్ చేయండి. ఆగండాగండి.. మీ టపా వెంటనే పబ్లిష్ కాదు. ఫలానా టైం కి మనం schedule చేసి పెట్టామన్నమాట. అది సరిగ్గా టైం కి పబ్లిష్ అవుతుంది మీరు కంప్యూటర్ ముందు లేకున్నా. మీ కంప్యూటర్ ఆఫ్ చేసి ఉన్నాకూడా. ఇలా సెట్ చేసి నిశ్చింతగా మీ పనులు చేసుకోవచ్చు. అలారం పెట్టినట్టు మీరు ఇచ్చిన సమయానికి మీ టపా బ్లాగులో ప్రత్యక్షమవుతుంది.. భలే ఉంది కదూ..

No comments:

Post a Comment