నాలుగు లైన్ల కథకు రెండున్నర గంటల సినిమా చేస్తే దాన్ని ఏమంటారు?? పైగా ఆ సినిమా చూసి భయపడితేఐదులక్షల బహుమతి.. అది కూడా థియేటర్లోని టికెట్లన్నీ కొని, ఒక్కరే కూర్చుని, కళ్ళు మూసుకోకుండా చూడాలి. మధ్యలో పారిపోకూడదు. ఎవరైనా ప్రయత్నిస్తారా? ఐతే ముందు ఆ సినిమా కథ చదవండి. తర్వాత మీ ఇష్టం.
ఇలా మనం రాసే టపాలలో కొన్ని ఇతర బ్లాగులు, సైట్లలోని పేజీలకు అనుసంధానం, లేదా లింక్ ఇవ్వాలి. ఆ పేజి లింక్ మొత్తం ఇస్తే తికమకగా ఉంటుంది. కాపీ,పేస్ట్ చేయడంలో తప్పులు పోవచ్చు. పెద్ద పని. కాని ఇలా ఒక పదానికి సంబంధిత పేజి లింక్ ఇస్తే సులువుగా ఉంటుంది. అది ఎలాగో చూద్దాం.
New post కి వెళ్లి మీరు రాయాల్సిన టపా రాయండి.అందులో ఏ పదానికి మీరు వేరే పేజి, బ్లాగు లింక్ ఇవాలనుకున్నారో దాని లింక్ కాపీ చేసుకోండి. మీరు లింక్ ఇవ్వాలనుకున్న పదాన్ని సెలెక్ట్ చేసుకొని పైన గొలుసు బొమ్మ ని క్లిక్ చేయండి. అప్పుడు వచ్చే బాక్స్ లో మీరు ఇవ్వాలనుకున్న లింక్ చిరునామాని ఇవ్వండి. అంతే ఆ పదానికి సంబంధిత లింక్ చేర్చబడింది.
మీరు లింక్ ఇచ్చిన పదం బోల్డు చేయండి. దాని రంగు కూడా వేరుగా ఉంటుంది. మీ టపా చదివేవాళ్ళకి తెలుసుకోవడానికి సులువుగా ఉంటుంది.
No comments:
Post a Comment