Thursday, September 30, 2010

బ్లాగింగ్ ట్యుటోరియల్స్ మరియు ఉచిత టెంప్లేట్స్ కోసం ఒక మంచి సైట్

మీరు క్రొత్తగా బ్లాగ్ ని ప్రారంభించాలను కొంటున్నారా... ఆల్రెడీ వున్న బ్లాగ్ ని అందంగా మరియు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనుకొంటే కనుక బ్లాగింగ్ ట్యుటోరియల్స్ మరియు ఉచిత టెంప్లేట్స్ కోసం http://www.blogspottutorial.com/ సైట్ ని సందర్శించండి. ఇక్కడ ట్యుటోరియళ్ళు సచిత్రంగా స్క్రీన్ షాట్ల తో స్టెప్ బై స్టెప్ సులభంగా అర్ధమయ్యేరీతిలో ఉంటాయి. అలానే ఉచిత టెంప్లేట్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.



ఇది బ్లాగర్స్ కి ఉపయోగపడే ఒక మంచి సైట్...

Blogger కీ బోర్డ్ షార్ట్ కట్స్:

[Ctrl] + [B] - Bold
[Ctrl] + [I] - Italic
[Ctrl] + [L] - Blockquote
[Ctrl] + [Z] - Undo
[Ctrl] + [Y] - Redo
[Ctrl] + [Shift] + [A] - Add hyperlink
[Ctrl] + [Shift] + [P] - Preview
[Ctrl] + [D] - Save as draft
[Ctrl] + [P] - Publish
[Ctrl] + [S] - Save
[Ctrl] + [G] - Indic script transliteration

Jotti's malware scan - 20 యాంటీ-వైరస్ ప్రోగ్రాములను ఉపయోగించి మీ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్కాన్ చేసుకోండి...

Jotti's malware scan సైట్ లో దాదాపు 20 ప్రముఖ యాంటీ-వైరస్ ప్రోగ్రాములను ఉపయోగించి మీ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్కాన్ చేసుకోవచ్చు. Jotti's malware scan సైట్ కి వెళ్ళి ’Browse' పై క్లిక్ చేసి స్కాన్ చెయ్యవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Submit file' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఫైల్ అప్ లోడ్ చెయ్యబడి దాదాపు ౨౦ ప్రముఖ యాంటీ వైరస్ ప్రోగ్రాములైన Bit Defender, Clam AV, NOD 32, Mormon, AVG, A-Squared, Dr. Web, Avast మొ. వాటితో ఫైల్ స్కాన్ చెయ్యబడి స్కాన్ రిజల్ట్ చూపెడుతుంది.






వెబ్ సైట్ : Jotti's malware scan

PHOTOSnack - ఉచితంగా ఫోటో స్లైడ్ షోస్ తయారుచేసుకోవటానికి...

PHOTOSnack - ఆన్ లైన్ లో ప్రొఫెషనల్ ఫోటో స్లైడ్ షోస్ తయారుచేసుకోవటానికి ఒక సులభమైన మార్గం ... ముందుగా photosnack అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.


స్టెప్ ౧. UPLOAD: PHOTOSnack సైట్ కి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత 'Make a Slideshow' పై క్లిక్ చెయ్యాలి, టెంఫ్లేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ’Upload Photos' పై క్లిక్ చేసి గరిష్టంగా 250 MB వరకు ఒక్కొక్క ఫైల్ సైజ్ 10 MB వరకు jpg, jpeg, png and gif ఫార్మేట్ లో వున్న ఫైళ్ళను అప్ లోడ్ చేసుకోవాలి.

స్టెప్ ౨. CUSTOMIZE: Customize Album లో ఆల్బమ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, ఇమేజ్ జతచెయ్యవచ్చు, వ్యక్తిగత లోగో జత చెయ్యవచ్చు. అలాగే Navigation లో స్లైడ్ షో స్పీడు, యూజర్ ఇంటరాక్షన్ మరియు ఆటో హైడ్ కంట్రోల్స్ సెట్ చేసుకోవచ్చు.

స్టెప్ ౩. SHARE: తయారుచేసుకొన్న ఆల్బమ్ ని ఇతరులతో పంచుకోవటానికి లింక్ మరియు ఎంబెడ్ కోడ్ వస్తాయి.

CutMyPic - Cut & Customize your picture

CutMyPic అనే వెబ్ సైట్ కి వెళ్ళి ఇమేజ్ లో కావల్సిన భాగాన్ని సెలెక్ట్ కొని రీ-సైజ్ చేసుకోవచ్చు అదీ కేవలం మూడేమూడు స్టెప్పుల్లో

స్టెప్ ౧. CutMyPic సైట్ కి వెళ్ళి ’Browse' పై క్లిక్ చేసి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ’Go' పై క్లిక్ చెయ్యాలి.

స్టెప్ ౨. ఇమేజ్ లో కావల్సిన భాగాన్ని సెలెక్ట్ చేసుకొని ’Preview' బటన్ పై క్లిక్ చేసి ప్రివ్యూ చూసిన తర్వాత ’Done' పై క్లిక్ చెయ్యాలి.

స్టెప్ ౩. ఇప్పుడు ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ఈ-మెయిల్ కూడా పంపవచ్చు.

ఇలాంటివే మరికొన్ని వెబ్ సైట్లు Pixenate, rsizr, Resize Your Image .

SMSjosh - ఉచిత సంక్షిప్త సందేశాలు పంపటానికి మరొక సైట్

ఇండియాలో ఏదైనా మొబైల్ కి ఉచిత SMS లు పంపటానికి చాలా వెబ్ సైట్లు వున్నాయి ... గత మాసం కంప్యూటర్ ఎరా పాఠకుల సమావేశం లో SMSjosh సైట్ గురించి తెలుసుకోవటం జరిగింది... SMSjosh నుండి కూడా ఇతర సైట్ల మాదిరిగా ఇండియాలో ఏదైనా మొబైల్ కి ఉచిత SMS లు పంపవచ్చు కాకపోతే ఈ సైట్ లో ఇతర సైట్ల లా ప్రకటనల గజిబిజీ మరియు కన్పూజన్ లేకుండా చూడచక్కగా వుంది అంతేకాకుండా ఉచిత అకౌంట్ లో ఒకేసారి 5 మొబైల్ నంబర్లకు గరిష్టంగా 120 అక్షరాల వరకు మెసేజ్ పంపవచ్చు.

వెబ్ సైట్: SMSjosh

WeTransfer - పెద్ద ఫైళ్ళు ట్రాన్స్ ఫర్ చెయ్యటానికి...

ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా 2 GB వరకు చిన్న లేదా పెద్ద ఫైళ్ళను WeTransfer సైట్ కి వెళ్ళి ఉచితంగా కావల్సిన వారికి పంపవచ్చు.


ముందుగా https://www.wetransfer.com/ సైట్ కి వెళ్ళి Add Files పై క్లిక్ చేసి పంపవలసిన ఫైళ్ళను 2GB వరకు యాడ్ చేసుకోవచ్చు. Enter friend's email address దగ్గర ఫైల్స్ ఎవరికైతే పంపాలో వారి ఈ-మెయిల్ అడ్రస్ ఎంటర్ చెయ్యాలి. Enter your email address దగ్గర మన మెయిల్ ఐడి ఎంటర్ చేసి ’Transfer' బటన్ పై క్లిక్ చెయ్యాలి. మనం పంపిన ఫైళ్ళ డౌన్లోడ్ లింక్ ఫ్రెండ్స్ ఈ-మెయిల్ ఐడి కి పంపబడుతుంది. దానిపై క్లిక్ చేసి ఫైళ్ళను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైళ్ళు 2 వారాల వరకు డౌన్లోడ్ కి అందుబాటులో వుంటాయి. అంతేకాకుండా ఒకేసారి 20 మెయిళ్ళకు పంపే సదుపాయం కలదు.

వెబ్ సైట్: https://www.wetransfer.com/

Drawspace - ఆన్ లైన్ లో డ్రాయింగ్ నేర్చుకోవటానికి!

పిల్లలు, పెద్దలు ఎవరైనా సులభ పధ్ధతుల్లో ఉచితంగా డ్రాయింగ్ నేర్చుకోవాలనుకొంటే కనుక Drawspace సైట్ కి వెళ్ళాల్సిందే, ఇక్కడ డ్రాయింగ్ నేర్చుకోవటానికి ఎన్నో పాఠాలున్నాయి, వాటిని Beginner, Intermediate, Advaced అనే మూడు విభాగాలుగా విభజించారు. ఇక్కడ సాధారణ డ్రాయింగ్, షేడింగ్, క్యారికేచర్, కార్టూన్లు మొదలగు వాటిని అందంగా మరియు ఆకర్షణీయంగా గీయటానికి ఎన్నో పాఠాలున్నాయి.


ఇంకా... ఎందుకు ఆలశ్యం Drawspace సైట్ కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడవున్న పాఠాల ద్వారా అందమైన బొమ్మలు గీయటం మొదలు పెట్టండి.

వెబ్ సైట్: Drawspace