ఫేస్ బుక్ లో ఇప్పుడు రెండు క్రొత్త ఫీచర్లు యాడ్ అయ్యాయి అవి కామెంట్లకు సంబంధించినవే. కామెంట్ చెయ్యాలంటే కనుక ఇదివరలా Comment పై క్లిక్ చెయ్యాల్సిన అవసరం లేదు, ప్రతీ పోస్ట్ క్రింద ఆటోమాటిక్ గా కామెంట్ బాక్స్ వస్తుంది అక్కడ కామెంట్ టైప్ చేసి Enter కీ ప్రెస్ చెయ్యటమే. కామెంట్ బాక్స్ లో తర్వాత లైన్ కి వెళ్ళటానికి Shift+Enter కీలను ప్రెస్ చెయ్యాలి.
ఇంకొక విషయం మనం పోస్ట్ చేసిన కామెంట్ ని ఎడిట్ కూడా చెయ్యవచ్చు, దాని కోసం మన కామెంట్ చివర మూలన ఉన్న క్రాస్ (X) మార్క్ పై క్లిక్ చెయ్యటమే. ఎడిట్ చేసిన కామెంట్ ని పెట్టటానికి తిరిగి ఎంటర్ బటన్ ప్రెస్ చెయ్యాలి. ఎడిట్ ఆప్షన్ కొన్ని సెకన్ల వరకే అంటే ఒక నిమిషం వరకు పనిచేస్తుంది. కామెంట్ లాక్ అయిన తర్వాత దానికి తొలగించటం తప్ప వేరే మార్గం లేదు.
No comments:
Post a Comment