Monday, December 20, 2010

Driver Magician Lite - విండోస్ డివైజ్ డ్రైవర్లు బ్యాకప్ తీసుకోవటానికి పోర్టబుల్ అప్లికేషన్

మన పీసీ సరిగా పనిచెయ్యనప్పుడు ఫార్మేట్ చేసి ఫ్రెష్ గా ఆపరేటింగ్ సిస్టం ఇనస్టలేషన్ చేసిన తర్వాత పీసీ లోని హార్డ్ వేర్ డివైజెస్ సరిగా పనిచెయ్యాలంటే వాటి డ్రైవర్లు ఇనస్టలేషన్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే డ్రైవర్ల కోసం ఆయా డ్రైవర్ సీడీ లేదా అంతర్జాలం పై ఆధారపడుతూ ఉంటాం. అలా కాకుండా పీసీ క్రొత్తగా కొన్నప్పుడు డివైజ్ డ్రైవర్లను బ్యాక్ అప్ తీసుకోవటం వలన డ్రైవర్ సీడీ దొరకకపోయినా లేదా అంతర్జాలంలో సరైన డ్రైవర్ లభించనప్పుడు ముందుగా తీసుకున్న బ్యాక్ అప్ పోల్డర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే పీసీ లోని డివైజెస్ యొక్క డ్రైవర్లను బ్కాక్ అప్ తీసుకోవటానికి Driver Magician Lite అనే పోర్టబుల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీనిని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు Driver Magician సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని రన్ చెయ్యటమే.



రెడ్ కలర్ లో ఉన్నవి మనం ఇనస్టలేషన్ డ్రైవర్లు, కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకొని ’Start Backup' బటన్ పై క్లిక్ చేసి డెస్టినేషన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొంటే ఆ ఫోల్డర్ లోకి డ్రైవర్లు బ్యాక్ అప్ తీసుకోబడతాయి.


డౌన్లోడ్: Driver Magician

1 comment: