Thursday, September 30, 2010

ఈ-బుక్స్ డౌన్లోడ్ కోసం వెబ్ సైట్లు ...

కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్, మేథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్ మరియు లెక్చర్ నోట్స్ మొదలగు వాటికి సంబంధించిన ఈ-బుక్స్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవటం కోసం ఈ క్రింది వెబ్ సైట్లు చూడండి:



1. Zillr

thumba - ఉచిత ఆన్ లైన్ ఇమేజ్ ఎడిటర్

thumba - మైక్రోసాప్ట్ సిల్వర్ లైట్ ఆధారంగా పనిచేసే ఒక బెస్ట్ ఉచిత ఆన్ లైన్ ఇమేజ్ ఎడిటర్. thumba సైట్ నుండే సిల్వర్ లైట్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌజర్ ఇమేజ్ ఎడిటర్ లా మారుతుంది. ఎడిట్ చెయ్యవలసిన ఫోటోలను డ్రాగ్-అండ్-డ్రాప్ పద్ధతిలో thumba లో ఓపెన్ చెయ్యవచ్చు, లేదంటే thumba మెనూ లో ’Get Started'---> ’Open' పై క్లిక్ చేసి ఎడిట్ చెయ్యవలసిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని thumba లో ఓపెన్ చెయ్యవచ్చు. వెబ్ కెమెరా ఉపయోగించి కూడా ఫోటోలను ఫ్రెష్ గా లోడ్ చేసుకోవచ్చు.



ఇమేజ్ కి టెక్స్ట్ జతచెయ్యటం, వేరొక ఇమేజ్ యాడ్ చెయ్యటం, బ్రషెస్, రెడ్ ఐ ని తొలగించటం, ఇమేజ్ లో కావలసిన భాగాన్ని డిస్టార్ట్ చెయ్యటం, రీ సైజ్, ఇమేజ్ ని టెక్స్ట్ లోకి మార్చటం, ఇమేజ్ రొటేషన్, కలర్ బ్యాలన్స్, ఇమేజ్ ని గ్రేస్కేల్ కి మార్చటం, బ్లర్ ని తగ్గించటం, డిస్టార్షన్ కరెక్షన్ యిలా చాలనే ఫీచర్లు వున్నాయి. ఎడిట్ చేసిన ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ కూడా చేసుకోవచ్చు.


thumba ని ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే ఉపయోగించవచ్చు, అంతే కాకుండా డెస్క్ టాప్ లో కూడా ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్: thumba

పిల్లల కోసం బెస్ట్ వెబ్ సైట్స్...

గూగుల్ కిడ్స్ గురించి నిన్నటి పోస్ట్ లో తెలుసుకున్నాం... ఈ పోస్ట్ లో పిల్లలకు ఉపయోగపడే మరిన్ని సైట్స్ గురించి తెలుసుకుందాం..

౧. యాహూ కిడ్స్ :

ఈ సైట్ లో పిల్లలకోసం మ్యూజిక్, మూవీ, జోక్స్, ఈ-కార్డ్స్, ఎన్ సైక్లోపీడియా, హారోస్కోప్, రిఫెరెన్స్ మెటీరియల్ యిలా చాలానే వున్నాయి. పేరెంట్స్ కోసం ప్రత్యేక సెక్షన్ కూడా వుంది, ఇక్కడ మూవీ రివ్యూ, ఆన్ లైన్ సేఫ్టీ గురించి పిల్లలకు ఎలా తెలియ చెయ్యాలి, యిలా చాలానే వున్నాయి.



వెబ్ సైట్: http://kids.yahoo.com/

౨. నేషనల్ జియోగ్రాఫిక్ కిడ్స్:

ఇక్కడ స్టోరీస్, యాక్టివిటీస్, వీడియోలు, యానిమల్స్, గేమ్స్, ఫోటోలు, ఇంకా ఇతర ఎడ్యుకేషనల్ లింకులు వున్నాయి.



వెబ్ సైట్: http://kids.nationalgeographic.com/kids/

౩. ఫనాలజీ:

జోక్స్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, మాజిక్ ట్రిక్స్, Weird Science సెక్షన్ లో పిల్లలు చెయ్యగలిగే ఫిజిక్స్, కెమిస్ట్రీ , బయాలజీ మొ. వాటికి సంబంధించిన ప్రయోగాలు వున్నాయి. నూరూరించే రుచులు యింకా ఎన్నో...


వెబ్ సైట్: http://funology.com/

౪. ఫన్ బ్రెయిన్:
ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన ఎడ్యుకేషనల్ సైట్ ఇది. వెబ్ బుక్స్ + కామిక్స్, మెదడుకు పదును పట్టే ఇంటరాక్టివ్ గేమ్స్, టీచర్స్ మరియు పేరెంట్స్ కోసం సలహాలు యింకా చాలావున్నాయి.


వెబ్ సైట్: http://www.funbrain.com

౫. పీబీఎస్ కిడ్స్:
పిల్లల కోసం గేమ్స్, వీడియోస్, ఈ-కార్డ్స్ యిలా చాలా వున్నయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరదాగా మరియు ఆసక్తికరంగా వుంటుంది.



వెబ్ సైట్: http://pbskids.org/

Wikibooks - ఉచిత ఎడ్యుకేషనల్ టెక్స్ట్ బుక్స్ ....

ప్రముఖ వికీపీడియా వారి వికీబుక్స్ లో కేజీ నుండి పీజీ వరకు వివిధ సబ్జెక్టులలో వివిధ బుక్స్ ఉన్నాయి. వాటిలో పీడీఎఫ్ లేదా వార్డ్ లో వున్న కొన్ని బుక్స్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. పిల్లల కోసం Wikijunior మరియు రకరకాల వంటల కోసం Cookbook అని ప్రత్యేక లింకులున్నాయి. వికీబుక్స్ లో 36000 పైగా పేజీలున్నాయి. వికీపీడియా లో లాగా ఎడిట్ మరియు సొంత బుక్స్ కూడా ప్రారంభించవచ్చు.




వెబ్ సైట్ : వికీబుక్స్

ఫోటోలను స్కెచ్ లు గా మార్చటానికి ఉచిత ఆన్ లైన్ టూల్స్..

డిజిటల్ ఫోటోలను ఆర్టిస్టిక్ స్కెచ్ లు గా మార్చటానికి ఆన్ లైన్ లో చాలా ఉచిత టూల్స్ లభిస్తాయి, వాటిలో కొన్నింటిని యిక్కడ తెలియచేస్తున్నాను:

౧. DUMPR - Photo Pencil Sketch:

DUMPR సైట్ కి వెళ్ళి ముందుగా కావలసిన ఫోటోను అప్ లోడ్ చేసి ఒకేఒక క్లిక్ తో ఫోటోను పెన్సిల్ స్కెచ్ గా మార్చవచ్చు, అలా మారిన ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ఇతరులకు ఈ-మెయిల్ పంపవచ్చు.


౨. tjshome - ఆన్ లైన్ ఇమేజ్ కన్వర్టర్:
ఈ సైట్ కి వెళ్ళగానే స్టెప్ ౧ లో వివిధ అప్శన్లు వుంటాయి అవి ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ లేదా రెడ్ షేడ్ లేదా స్కెచ్ మొదలగునవి. వాటిలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకొని స్టెప్ ౨ లో ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ’Submit' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఇమేజ్ కావలసిన విధంగా మార్చబడుతుంది. అలా మార్చబడిన ఇమేజ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.


౩. befunky :
Befunky సైట్ కి వెళ్ళి ’Get started' పై క్లిక్ చేస్తే Photo Effects ని సెలెక్ట్ చెయ్యమంటుంది. అక్కడ కావలసిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ’Browse Files' పై క్లిక్ చేసి ఇమేజ్ ని అప్ లోడ్ చెయ్యాలి. కావలసిన విధంగా మారిన ఇమేజ్ ని ’Save' బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.




ఆన్ లైన్ లో కాకుండా మనసిస్టం లోనే ఇమేజ్ లను అందమైన పెయింటింగ్స్ గా , స్కెచెస్ గా లేదా డ్రాయింగ్స్ గా మార్చుకోవటానికి fotosketcher అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడూతుంది.

ZEDGE - Free stuff for your phone

క్లోజప్ యాడ్ చూస్తున్నప్పుడు ’దగ్గరగా రా.... దగ్గరగా రా...’ అనే జింగిల్ వస్తుంది, దానినే రింగ్ టోన్ గా మార్చేసుకుంటే బాగుండు అనిపిస్తుందా ... అదే కాదు అలాంటి ఎన్నో జింగిల్స్ ని మీ మొబైల్ పోన్ రింగ్ టోన్స్ గా మార్చాలనుకుంటున్నారా... అయితే ZEDGE సైట్ కి ఒక్కసారి వెళ్ళాల్సిందే ... ఇక్కడ మీ మొబైల్ ఫోన్ కోసం ఉచిత స్టఫ్ చాలానే వుంది. రింగ్ టోన్స్, థీమ్స్, వీడియోస్, గేమ్స్ యిలా ఎన్నో.... డైరెక్ట్ గా మొబైల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే పీసీ లోకి డౌన్లోడ్ చేసుకొని తర్వాత మొబైల్ కి కాపీ చేసుకోవచ్చు. ఈ సైట్ లో వున్న వాటిని డౌన్లోడ్ చేసుకోవటమే కాదు మీ దగ్గర వున్న వాటిని కూడా ఈ సైట్ కి అప్ లోడ్ చెయ్యవచ్చు. ఇవేకాకుండా వాల్ పేపర్, థీమ్, స్క్రీన్ సేవర్ మొదలగునవి తయారుచెయ్యటానికి టూల్స్ కూడా వున్నాయి.




కావలసిన వాటిని సెర్చ్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్ : ZEDGE

ఈ-బుక్స్ డౌన్లోడ్ కోసం వెబ్ సైట్లు ...

కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్, మేథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్ మరియు లెక్చర్ నోట్స్ మొదలగు వాటికి సంబంధించిన ఈ-బుక్స్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవటం కోసం ఈ క్రింది వెబ్ సైట్లు చూడండి:



1. Zillr